Sunday, June 22, 2014

ఏ పని కావాలన్నా డబ్బులుంటే చాలు!
-Shirley MacLaine

చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ‘అబ్బ! ఎంత బాగా ఆడుతున్నడు బిడ్డ’ అనుకుంటరు. కానీ అదే బిడ్డ పెద్దయ్యాక, ఏ ఆట పాడినా, ఏ పాట పాడినా, డబ్బులు సంపాదిస్తున్నాడా లేడా అన్నదే చూస్తారు!
-Leo Durocher

దేన్నయినా డబ్బుతో కొనిపారేయవచ్చు, పేదరికాన్ని తప్ప!
-Joe E. Lewis

డబ్బుతో లొంగదీసుకోని లక్షణం నీ దగ్గర ఉంటేనే నువ్వు నిజమైన ధనవంతుడివి!
-Garth Brooks

అధికారం, డబ్బు, వీటికంటే ఈ ప్రపంచంలోని అద్భుతమైన సంపద పిల్లలే.
-Mario Puzo

రాజకీయాల్లో గనుక విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టకపోతే ప్రజాస్వామ్యం నిజంగానే పరిఢవిల్లుతుంది.
-Imran Khan
సినిమా సక్సెస్ అన్నది కాసులు కురవడం మీదే ఆధారపడి ఉంటుంది తప్పా, అది మంచి సినిమా కావడం వల్ల విజయవంతమైన సినిమా అయిపోదు.-John Cusack

ఈజీగా డబ్బు సంపాదించడం మానేశాక నాకు తృప్తిగా ఉంది. -Ben Stein

నేను డబ్బులో పుట్టలేదు. -Christina Ricci

ఒకప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులుండేవారు. కానీ ఇప్పుడు సెలబ్రిటీ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు తయారవుతున్నారు. వీళ్లకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల మాదిరిగా డబ్బు అవసరం ఏమీ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ వాళ్ల పొట్ట గొట్టే పనే చేస్తున్నారు.
-David Duchovny

మా అమ్మ ఒక స్కూలు టీచరుగా పని చేసేది. ఆ రోజుల్లో అమ్మ సంపాదన తక్కువే. అయినా మేం హాయిగా, ఆనందంగా ఆ రోజుల్ని వెళ్లదీశాం. నా ఉద్దేశ్యం ఆనందంగా ఉండటం వేరు, సుఖంగా ఉండటం వేరు. మా అమ్మ వల్ల మేం ఆనందంగా జీవించడం నేర్చుకున్నాం.-Dave Grohl

పిల్లల మనస్తత్వంతో ఉన్నవాళ్లని ఎవరైనా అభిమానిస్తారు. కానీ, వాళ్లు అప్పు అడిగితే మాత్రం ఎందుకో ఇవ్వాలనిపించదు!-Arthur Miller 
డబ్బు విషయానికి వస్తే అందరి మతమూ ఒకటే.
-Voltaire

చ్యూయింగ్ గమ్‌కు, ఆకు పోకకు ఖర్చు పెట్టకుండా పుస్తకాలు కొని చదివితే ఈ దేశమైనా ఎప్పుడో బాగు పడేది!
-Elbert Hubbard

డబ్బుకోసం వెంపర్లాడినప్పుడు నాకు దొరకలేదు. ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి కష్టపడితే నలుగురికి సాయం చేసేంత డబ్బు సమకూరింది. అంతేకాదు, సంతోషమూ నా సొంతమైంది.
-Wayne Dyer

సంతోషం అంటే చేతినిండా డబ్బు ఉండటం కాదు.
- Joel Osteen

బ్యాంకుకు వెళ్లి పిడికెడన్ని కాసులు కావాలని అడిగా. ‘ఎందుకూ?’ అన్నారు. చక్కెర కొనుక్కోవడానికి’ అని చెప్పా. అలా పెరిగిపోయాయి మరి రేట్లు!
-Steven Wright

పేదరికానికి కారణం ఆనందంగా ఉండాలన్న సంకల్పం లేకపోవడం కూడా...అవును మరి. కళాపోషణ లేకపోతే డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
-Alan Watts
నా గురించి ఎట్లపడితె అట్ల మాట్లాడ్డానికి కుదర్దు. నా దగ్గర బాగా డబ్బుంది మరి!
-Samantha Bee

నేను డబ్బులేకపోయినా బతుకుతాను గానీ ప్రేమ లేకపోతే బతకలేను!
-Judy Garland

వ్యాపారం అంటేనే పరాయివాళ్ల సొమ్మును ఖర్చు చేయడం!
-Delphine de Girardin

తన భార్య పెట్టే ఖర్చుకంటే అధికంగా సంపాదించేవాడే విజయవంతమైన భర్త. అటువంటి భర్తను పొందిన స్త్రీయే విజయవంతమైన భార్య.
-Lana Turner

డబ్బుతో పనే లేనట్టు పని చేయి. భంగపడ్డ సంగతే తెలియనట్టు ప్రేమించు. ఎవరూ చూడటం లేదన్నట్టే డాన్స్ చేయి. అప్పుడు నిన్ను మించిన వాడుండడు!
-Satchel Paige

డబ్బుకన్నా సమయమే విలువైంది. కావాలంటే డబ్బును సంపాదించగలం. కానీ సమయాన్ని తిరిగి పొందలేవు!
-Jim Rohn

డబ్బుతో స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభిస్తాయని అనుకోవడం పొరబాటు. అది అసాధ్యం. నిజానికి మనిషికి నిజమైన సంపద ఏమిటంటే విజ్ఞానం, సుసంపన్నమైన అనుభవం, నైపుణ్యాలే!
-Henry Ford

Sunday, May 11, 2014

అధికారం చెలాయించాలంటే డబ్బుంటే చాలు!
-David Korten

డబ్బు రాకడకు, పోకడకు నేను లావుగా ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి?
-Marlon Brando

ఎవరైనా ‘పొయ్యేటోళ్లే’ అన్నది ఎంత నిజమో, ఇవ్వాళో రేపో ఎవరైనా డబ్బుకు అమ్ముడు పోయేటోళ్లే అన్నా అంతే నిజం!!
-Tony Randall

ఎవరైనా డబ్బు సంపాదించాలనే పెద్ద పెద్ద కంపెనీలని స్థాపిస్తారు. బాగా డబ్బు గడించాక బయటకు రావచ్చనీ అనుకుంటారు. కానీ ఇరుక్కు పోయిన సంగతి వాళ్లకూ తెలిసి చావదు!
-Arthur Rock

నాకిష్టమైన అంశాలేమిటా అని ఆలోచిస్తే అందులో డబ్బుపై వ్యామోహం అన్నది లేనే లేదు. అంతేకాదు మిత్రమా...మనకున్న విలువైన ఆస్తి డబ్బని కాదు, కాలం!
-Steve Jobs

అవసరమైనప్పుడు మనిషి తన సిద్ధాంతాలకన్నా డబ్బువైపే మొగ్గు చూపుతాడు. గుండెపై చేయి వేసుకుని చెప్పండి...నేనన్నది రాంగ్ అని!
-Ralph Waldo Emerson 
డబ్బు ఎప్పుడూ ఉంటుంది. కానీ అది ఎల్లవేళలా మన పాకెట్లోనే ఉండదు. అదే దాని బలం, బలహీనత.
- Gertrude Stein

అందానికీ డబ్బుకూ సంబంధం ఉంది. మీరు నవ్వుకున్నా ఫర్లేదు, నేను నిజం చెబుతున్నాను. డబ్బును దాయడం అన్నది ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. లేనప్పుడు ఏదో విధంగా కొట్టేయడం తప్పా మరో మార్గం లేదు. కొట్టేశామా ఇక ఆ మనిషి అందవిహీనం అవడం ఖాయం.
- Demi moore

డబ్బులు పోగవటాన్ని చూడ్డం కన్నా అది సమాజాన్ని మార్చడానికి ఉపయోగ పడటాన్ని చూడటం ఒక అద్భుతం.
-Gloria Steinem

బెన్ ఫ్రాంక్లిన్ విద్యుత్తును కనిపెట్టి ఉండవచ్చు. కానీ డబ్బుల కోసం మీటర్ తయారు చేశాడే... వాడే గొప్ప అంటాను నేను!
-Warren Beaty

రూల్ నంబర్ వన్: డబ్బును దుబారా చేయవద్దు!
రూల్ నంబర్ టూః రూల్ నంబర్ వన్‌ను మరచిపోవద్దు.
-Warren Buffett

నేనెన్నడూ దుస్తులపై డబ్బు ఖర్చు పెట్టను. పెట్టలేదు.
-Lauren Hutton

నీకు ఎన్ని మంచి లక్షణాలుంటే ఏం? డబ్బు సంపాదించడమే సిసలైన లక్షణం.
- Johann Georg Zimmermann
డబ్బన్నా ఉండాలి లేదం ఒక మహత్తర కార్యంలో నిమగ్నమైనా కావాలి. లేకపోతే ఈ దున్యాలో నరకమే బ్రదర్...
-డోయల్ బ్రూన్‌సన్

డబ్బుంటే వైభవమే వైభవం. అహాః అసొంటి డబ్బును నా లాగా ప్రేమించడం అంటే అది మిస్టిసిజమే అంటే మీరేమంటారు?
- సాల్వడర్ డాలీ

తమను తాము ఉద్ధరించుకునే లక్షణం లేని వాళ్లకు రూపాయి సాయం చేయడం కూడా వేస్టే!
-టైలర్ కాల్డ్

మహిళలకు రక్షణగా నిలిచేది చాలాసార్లు డబ్బే. అదే లేకపోతే ఆమె చాలా కష్టాలు పడుతుంది.
-క్లార్ బూత్ లూస్

లెక్కపెట్టుకుంటూ కూచునేవాళ్లు కోట్లు గడించడం కష్టం!
-జె. పాల్ గెట్టి

డబ్బుండటం కన్నా మనిషిగా కొంచెం గౌరవం ఉంటే ఇంకా బాగుంటది.
-పుబిలియస్ సైరస్

ఒకసారి డబ్బు సర్దావనుకో. మళ్లీ అవసరం పడ్డప్పుడు నువ్వే గుర్తొస్తావు వాళ్లకు. అందుకే సాయం అంటే నాకు మంట.
-ఆర్‌జివీ


mark
సమస్త నేరాలకు మూలం డబ్బే. 
-మార్క్ ట్వైన్
)



Oscar
చిన్నప్పుడు డబ్బు విలువైందే సుమా అనిపించేది! ముసలితనం వచ్చాక అది నిజమే అని అనుభవం మీద తెలుస్తోంది.
-ఆస్కార్ వైల్డ్>


‘డబ్బుతో ఏదైనా చేయవచ్చు’- అని ఎవరన్నా అన్నారనే అనుకోండి. ఇక అతడు ఏం చేసినా డబ్బు కోసమే అని పొరబడే ప్రమాదం ఉంది.
money
-బెంజిమన్ ఫ్రాంక్లిన్



gates
మనిషి ప్రవర్తనలో మార్పు తేవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని నా అభివూపాయం.
-బిల్ గేట్స్



picasso
నాకు పేదవాడిలా జీవించాలని ఉంది, కావల్సినంత డబ్బు దగ్గర పెట్టుకుని...
-పాబ్లో పికాసో (కళాకారుడివే)



john
ఒకింత ఆలోచన, కాసింత దయ డబ్బు చేసే దానికన్నా ఎక్కువ ఉపకారం చేస్తాయి.
-జాన్ రస్కిన్



Beds
పడకపై క్షణం వేస్టు చేయకు. అక్కడ కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటే తప్ప!
-జార్జ్ బర్న్స్