Sunday, June 22, 2014

ఏ పని కావాలన్నా డబ్బులుంటే చాలు!
-Shirley MacLaine

చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ‘అబ్బ! ఎంత బాగా ఆడుతున్నడు బిడ్డ’ అనుకుంటరు. కానీ అదే బిడ్డ పెద్దయ్యాక, ఏ ఆట పాడినా, ఏ పాట పాడినా, డబ్బులు సంపాదిస్తున్నాడా లేడా అన్నదే చూస్తారు!
-Leo Durocher

దేన్నయినా డబ్బుతో కొనిపారేయవచ్చు, పేదరికాన్ని తప్ప!
-Joe E. Lewis

డబ్బుతో లొంగదీసుకోని లక్షణం నీ దగ్గర ఉంటేనే నువ్వు నిజమైన ధనవంతుడివి!
-Garth Brooks

అధికారం, డబ్బు, వీటికంటే ఈ ప్రపంచంలోని అద్భుతమైన సంపద పిల్లలే.
-Mario Puzo

రాజకీయాల్లో గనుక విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టకపోతే ప్రజాస్వామ్యం నిజంగానే పరిఢవిల్లుతుంది.
-Imran Khan
సినిమా సక్సెస్ అన్నది కాసులు కురవడం మీదే ఆధారపడి ఉంటుంది తప్పా, అది మంచి సినిమా కావడం వల్ల విజయవంతమైన సినిమా అయిపోదు.-John Cusack

ఈజీగా డబ్బు సంపాదించడం మానేశాక నాకు తృప్తిగా ఉంది. -Ben Stein

నేను డబ్బులో పుట్టలేదు. -Christina Ricci

ఒకప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులుండేవారు. కానీ ఇప్పుడు సెలబ్రిటీ వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు తయారవుతున్నారు. వీళ్లకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల మాదిరిగా డబ్బు అవసరం ఏమీ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ వాళ్ల పొట్ట గొట్టే పనే చేస్తున్నారు.
-David Duchovny

మా అమ్మ ఒక స్కూలు టీచరుగా పని చేసేది. ఆ రోజుల్లో అమ్మ సంపాదన తక్కువే. అయినా మేం హాయిగా, ఆనందంగా ఆ రోజుల్ని వెళ్లదీశాం. నా ఉద్దేశ్యం ఆనందంగా ఉండటం వేరు, సుఖంగా ఉండటం వేరు. మా అమ్మ వల్ల మేం ఆనందంగా జీవించడం నేర్చుకున్నాం.-Dave Grohl

పిల్లల మనస్తత్వంతో ఉన్నవాళ్లని ఎవరైనా అభిమానిస్తారు. కానీ, వాళ్లు అప్పు అడిగితే మాత్రం ఎందుకో ఇవ్వాలనిపించదు!-Arthur Miller 
డబ్బు విషయానికి వస్తే అందరి మతమూ ఒకటే.
-Voltaire

చ్యూయింగ్ గమ్‌కు, ఆకు పోకకు ఖర్చు పెట్టకుండా పుస్తకాలు కొని చదివితే ఈ దేశమైనా ఎప్పుడో బాగు పడేది!
-Elbert Hubbard

డబ్బుకోసం వెంపర్లాడినప్పుడు నాకు దొరకలేదు. ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడానికి కష్టపడితే నలుగురికి సాయం చేసేంత డబ్బు సమకూరింది. అంతేకాదు, సంతోషమూ నా సొంతమైంది.
-Wayne Dyer

సంతోషం అంటే చేతినిండా డబ్బు ఉండటం కాదు.
- Joel Osteen

బ్యాంకుకు వెళ్లి పిడికెడన్ని కాసులు కావాలని అడిగా. ‘ఎందుకూ?’ అన్నారు. చక్కెర కొనుక్కోవడానికి’ అని చెప్పా. అలా పెరిగిపోయాయి మరి రేట్లు!
-Steven Wright

పేదరికానికి కారణం ఆనందంగా ఉండాలన్న సంకల్పం లేకపోవడం కూడా...అవును మరి. కళాపోషణ లేకపోతే డబ్బు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
-Alan Watts
నా గురించి ఎట్లపడితె అట్ల మాట్లాడ్డానికి కుదర్దు. నా దగ్గర బాగా డబ్బుంది మరి!
-Samantha Bee

నేను డబ్బులేకపోయినా బతుకుతాను గానీ ప్రేమ లేకపోతే బతకలేను!
-Judy Garland

వ్యాపారం అంటేనే పరాయివాళ్ల సొమ్మును ఖర్చు చేయడం!
-Delphine de Girardin

తన భార్య పెట్టే ఖర్చుకంటే అధికంగా సంపాదించేవాడే విజయవంతమైన భర్త. అటువంటి భర్తను పొందిన స్త్రీయే విజయవంతమైన భార్య.
-Lana Turner

డబ్బుతో పనే లేనట్టు పని చేయి. భంగపడ్డ సంగతే తెలియనట్టు ప్రేమించు. ఎవరూ చూడటం లేదన్నట్టే డాన్స్ చేయి. అప్పుడు నిన్ను మించిన వాడుండడు!
-Satchel Paige

డబ్బుకన్నా సమయమే విలువైంది. కావాలంటే డబ్బును సంపాదించగలం. కానీ సమయాన్ని తిరిగి పొందలేవు!
-Jim Rohn

డబ్బుతో స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభిస్తాయని అనుకోవడం పొరబాటు. అది అసాధ్యం. నిజానికి మనిషికి నిజమైన సంపద ఏమిటంటే విజ్ఞానం, సుసంపన్నమైన అనుభవం, నైపుణ్యాలే!
-Henry Ford